![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. ఇక నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వాలి కానీ, దానికి ముందు ఇమ్మ్యూనిటీ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గెలిచిన వారికి ఇమ్యూనిటీ లభించి నామినేషన్ ప్రక్రియ నుండి సేవ్ అవుతారు.
నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ 'ఇమ్యూనిటీ స్టార్స్'.. హౌస్ లో మొత్తంగా 12 మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిని ఆరుగురు చొప్పున రెండు టీములుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. ఇక డీమాన్ కెప్టెన్ కావడంతో సంచాలక్‌గా వ్యవహరించాడు. మీవైపు ఉన్న మొత్తం స్క్వేర్ బ్లాక్స్‌ని పూర్తిగా పగలగొట్టి.. అక్కడ ఉన్న మూడు స్టార్స్‌లో ఒకసారి ఒకదాన్ని మాత్రమే తీసుకొని కిందకి వచ్చి టీమ్ బాస్కెట్లో పెట్టాలి. ఇక మొదటి రౌండ్‌లో సుమన్ శెట్టి-దివ్య ఒక టీమ్, ఇమ్మాన్యుయల్ -సంజనలు ఒక టీమ్ గా ఆడారు. వీళ్లిద్దరి మధ్య టాస్క్ హోరాహోరీగా సాగింది. అయితే వీళ్లలో దివ్య-సుమన్ శెట్టి విజయం సాధించారు. ఆ తర్వాత తనూజ-భరణి, హరీష్-ఫ్లోరా మధ్య టాస్క్ జరిగింది. అయితే వీళ్లు బాక్సులు పగలగొట్టకుండానే స్టార్స్ తీసేశారు. దీంతో రూల్ ప్రకారం ఇద్దరూ ఫౌల్ చేశారు కాబట్టి, నో విన్నర్ బిగ్‌బాస్ అంటూ డీమాన్ షాకిచ్చాడు.
బిగ్‌బాస్ ఇచ్చిన రెండో లెవల్ టాస్క్.. 'వారధి కట్టు.. ఇమ్యూనిటీ పట్టు.' ఈ టాస్కులో భాగంగా కంటెస్టెంట్స్ చేయాల్సిందల్లా మీకు కేటాయించిన బ్రిడ్జెస్‌కి ఉపయోగపడే ప్లాంక్స్ మిగతా ఇంటి సభ్యుల దగ్గర ఉంటాయి.. వాటిని పొందడానికి పోటీదారులు ఆ ఇంటి సభ్యులను కన్విన్స్ చేయాల్సి ఉంటుందంటూ బిగ్‌బాస్ చెప్పాడు. టాస్కులో తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, దివ్య పోటీపడ్డారు. ముందుగా భరణి ఆ ప్లాంక్స్ పట్టుకొని వీళ్ల ముందు నిల్చున్నాడు. నేను కరెక్ట్ గా జడ్జ్ చేయలేకపోవడం వల్ల, నేను చేసిన మిస్టేక్స్ వల్ల.. ఇందాక ఫస్ట్ గేమ్‌లో నాతో పాటు తనూజ కూడా ఎఫెక్ట్ అయింది.. ఆ బాధ్యత నేను తీసుకోవాలి కాబట్టి ఈ రెండూ నేను తనూజకి ఇవ్వాలనుకుంటున్నానని భరణి అన్నాడు. ఇంతలో ఒక్కటే ఇవ్వాలంటూ మిగిలిన కంటెస్టెంట్స్ రూల్స్ మాట్లాడారు.
తర్వాత ఇమ్మాన్యుయల్ వచ్చి సుమన్ శెట్టిని సపోర్ట్ చేశాడు. ఈ గేమ్ విషయంలో సుమన్ అన్న ఎఫర్ట్స్ బాగా పెట్టాడని నాకు అనిపించిందని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. దీంతో కింద నేను అంత కొట్టాను కాబట్టి, ఆయన పైన అలా కొట్టగలిగారు కదా.. నేను చెప్పిన స్ట్రాటజీ అది.. అంటూ దివ్య అంది. పైకి వెళ్తానన్నది నేను.. అంటూ సుమన్ శెట్టి చెప్పాడు. మరి ఈ వారం టాస్క్ లు గెలిచి ఫైనల్ గా ఇమ్యూనిటీ పొందిన వారెవరో తెలియాలంటే మరో రోజు ఎదురుచూడాల్సిందే.
![]() |
![]() |